జగిత్యాల డీసీహెచ్​ఏలో కొనసాగిన ఎంక్వైరీ

జగిత్యాల డీసీహెచ్​ఏలో కొనసాగిన ఎంక్వైరీ

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగుల సీపీఎఫ్, జీపీఎఫ్, ఏరియర్స్​నిధులు పక్కదారి పట్టించిన ఘటనపై విచారణాధికారి శ్రీనివాస్ ప్రసాద్ బుధవారం ఎంక్వైరీ చేపట్టారు. బాన్సువాడ సూపరింటెండెంట్​గా పని చేస్తున్న డాక్టర్ శ్రీనివాస్​ ప్రసాద్ కు విచారణ బాధ్యతలు అప్పజెప్పడంతో డీసీహెచ్ఏ ఆఫీసులో ఇద్దరు అకౌంట్స్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఆడిటింగ్ చేపట్టారు.

 డిపార్ట్​మెంట్​నుంచి జారీ చేసిన చెక్కులు, వోచర్లతో పాటు బ్యాంకు నుంచి జరిపిన లావాదేవీల వివరాలను పరిశీలించారు. రూ. కోటి వరకు స్కామ్ జరిగినట్లు భావిస్తుండగా, అకౌంట్ సెక్షన్ లో పని చేసే రికార్డ్ అసిస్టెంట్ యాసిన్ భాగస్వామిగా గుర్తించి ఇదివరకే సస్పెండ్​ చేశారు. యాసిన్​ నుంచి రూ. 50 లక్షల 12 వేలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు.