ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం

ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం

సిద్దిపేట జిల్లా కొమురెల్లి మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపులో కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఆలయంలో పనిచేస్తున్న బూర్గుల కిషన్ చారీ, శ్రీనివాస చారి కలిసి.. లక్ష రూపాయల విలువైన బంగారం తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. హుండీ లెక్కింపు సందర్భంగా.. వీరిద్దరూ రెండు, మూడుసార్లు బయటకు వెళ్లి రావడంతో.. అనుమానంతో తనిఖీలు చేశారు. దీంతో… దాదాపు లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణం దొరికింది. కిషన్ చారీ, శ్రీనివాస చారీని.. పోలీసులకు అప్పగించారు ఆలయ అధికారులు.

కొమురెల్లి మల్లన్న ఆలయంలో 44 రోజులకు సంబంధించిన హుండీలను గురువారం లెక్కించారు. 24 హుండీల లెక్కింపులో.. 59 లక్షల 25వేల 195 రూపాయలు ఆదాయం వచ్చింది. వీటితో పాటు.. 114 గ్రాముల బంగారం, 7 కిలోల 200గ్రాముల వెండి, 26 విదేశీ కరెన్సీ నోట్లు, 34వేల పాతనోట్లు, 14 క్వింటాళ్ల ఒడిబియ్యం వచ్చాయని అధికారులు చెప్పారు.