చేతులెత్తి మొక్కుతాం.. మా జీతాలు ఇయ్యండి

చేతులెత్తి మొక్కుతాం.. మా జీతాలు ఇయ్యండి

పాల్వంచ, వె లుగు: పట్టణంలోని కేటీపీఎస్ 7వ దశకు అనుబంధంగా నిర్మిస్తున్న ఎఫ్ జీడీ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు.. వేతనాలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ సోమవారం సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని 50 మంది కార్మికులు చేతులెత్తి మొక్కుతూ నిరసన తెలిపారు.

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్ప త్రిలో పేషెంట్ కేర్, స్వీపర్లు,సెక్యూరిటీ గార్డ్స్ గా ఏజెన్సీ తరఫున పనిచేస్తున్న వారు.. సూపరింటెండెంట్ చాంబర్​ ఎదుట బైఠాయించారు. తమకు చెల్లించాల్సిన 3 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ సమస్యను ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లి జీతం చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు.