మణికొండ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ హంగామా

మణికొండ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ హంగామా

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ హంగామా చేశారు. డీఈఈ, ఏఈఈలపై విరుచుకుపడ్డారు. కుమార్ అనే కాంట్రాక్టర్ తన ఫైల్ పై సంతకం పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులను బెదిరింపులకు గురి చేశారు. గట్టిగా అరుస్తూ మహిళా ఉద్యోగులపై కాంట్రాక్టర్ మండిపడ్డారు. సంతకం పెట్టకపోతే మీ పని ఏంటో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడే ఉండి ఈ తతంగాన్నంతా చిత్రీకరిస్తు్న్న విలేకరిపై కూడా కాంట్రాక్టర్ దాడికి యత్నించారు. తన పర్మిషన్ లేకుండా వీడియో ఎందుకు రికార్డు చేస్తున్నావంటూ ఫొన్ లాగేసుకుని నానా హంగామా సృష్టించారు. వీడియో డిలీట్ చేయ్..  లేకపోతే నీ అంతూ చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కాంట్రాక్టర్ తీరుపై విలేఖరి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.