సారాయి దుకాణం డైలాగ్స్పై వివాదం.. తెలుగు ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు.

సారాయి దుకాణం డైలాగ్స్పై వివాదం.. తెలుగు ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్  నరసింహ నంది రూపొందిస్తున్న ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్రంపై  మహిళా సమాఖ్య ప్రతినిధులు ఫిల్మ్ చాంబర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మించిన ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను ఇటీవల విడుదల చేయగా అందులో అసభ్యకర డైలాగులు ఉన్నాయని ఫైర్ అయ్యారు.  

తెలంగాణ యాసను దుర్వినియోగం చేస్తూ, ఆడవారిని అవమానించేలా డైలాగులు ఉన్నాయని తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్‌‌‌‌ను కలిసిన  మహిళా సమాఖ్య ప్రతినిధులు కంప్లైంట్ అందజేశారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో   మహిళా సమాఖ్య ప్రతినిధులు దీపా దేవి,  నీరజ, ధనమ్మ తదితరులు పాల్గొని ఈ చిత్రం విడుదల చేయకుండా నిలిపివేయాలని కోరారు.