రాగి వాటర్ బాటిల్ లోని నీళ్లు .. ఆరోగ్యానికి ఎంతో మేలు

రాగి వాటర్ బాటిల్ లోని నీళ్లు .. ఆరోగ్యానికి ఎంతో మేలు

నీటిలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా లాంటి అనేక క్రిములను తొలగించే సామర్థ్యం కారణంగా రాగిని కొన్ని శతాబ్దాలుగా నీటిని శుద్ధి చేసే సహజ సాధనంగా ఉపయోగిస్తున్నారు. రాగి నీటి బాటిల్ వంటి రాగి పాత్రలో నీటిని నిల్వ చేయడం ద్వారా నీటిని సహజంగా శుద్ధి చేసి తాగడం సురక్షితమని చెప్పవచ్చు. రాగిలో శుద్దీకరణ లక్షణాలు ఉండడం వల్ల  అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది సహజ సిద్ధమైన పద్దతిలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు మంచి ఎంపిక.

రాగి సీసాల్లో నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది

రాగిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో హానికరమైన బ్యాక్టీరియా, మంటను సమర్థవంతంగా ఎదుర్కోగలవు. ఫలితంగా రాగి సీసాలోని నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, అల్సర్లు, అజీర్ణం సమర్ధవంతంగా తగ్గుతాయి. అదనంగా రాగి కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఇది మూత్రపిండాలు, కాలేయం రెండింటి పనితీరును నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. 

బరువు తగ్గడంలో ..

రాగి శరీరంలోని కొవ్వును మరింత సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో జీర్ణక్రియ పనితీరును ఆప్టిమైజ్ చేస్తుంది. దాంతో పాటు బరువు తగ్గించేందుకూ రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ మీరు బరువు తగ్గాలని భావిస్తున్నట్టయితే రాగి బాటిలో నిల్వ చేసిన నీటిని తీసుకోవడం ఉత్తమం.

గాయాలను వేగంగా నయం చేస్తుంది

రాగి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలతో సహా అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడే గొప్ప సాధనంగా పని చేస్తుంది. దీని వల్ల గాయం అయిన ప్రాంతంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఫలితంగా శరీరం రోగనిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది. 

ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేడ్ కీళ్ల సమస్య నివారణకు..

రాగి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఆర్థరైటిస్, కీళ్లలో లేదా కీళ్ల మధ్య ఏర్పడిన వాపులను, దురదను తగ్గిస్తుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సహా దీనికి సంబంధించిన నొప్పులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. రాగి ఎముకలను సైతం బలపరిచే ప్రత్యేక లక్షణాలను కూడా కలిగి ఉంది. ఈ తరహా సమస్యలుఎదుర్కొంటున్న వారికి రాగి మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. 

అనారోగ్యాన్ని ఎదుర్కునేందుకు రాగి మాత్రమే ఏకైక చికిత్సగా పరిగణించకూడదు. కాకపోతే ఇది వెల్‌నెస్ ప్లాన్‌కు విలువైన సాధనంగా తోడ్పడుతుంది. అందువల్ల మీ ఆరోగ్య ఆయుధాగారానికి రాగిని జోడించి, దాని వల్ల వచ్చే సహజ ప్రయోజనాలను ఆస్వాదించండి.