గాంధీలో పెరుగుతున్న కోవిడ్​ బాధితులు

గాంధీలో పెరుగుతున్న కోవిడ్​ బాధితులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా బారినపడి గాంధీ హాస్పిటల్లో చేరుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఒక్కరోజే 28 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. వారిలో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో ఐదుగురు బ్లాక్ ఫంగస్ పేషెంట్లు కూడా ట్రీట్మెంట్ కోసం గాంధీలో చేరారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో 103 మంది కొవిడ్ చికిత్స తీసుకుంటుండగా.. 8 మంది బ్లాక్ ఫంగస్ పేషెంట్లు ఉన్నారు. మెయిన్ బిల్డింగ్ లోని సెకండ్ ఫ్లోర్ కరోనా పేషెంట్లతో నిండిపోవడంతో అధికారులు మూడో అంతస్థును సిద్ధం చేస్తున్నారు. 

For more news..

పట్టాలు తప్పిన గువాహటి - బికనేర్ ఎక్స్ప్రెస్

420లతో చర్చకు రాను