తమిళనాడులో 50 వేల మార్కు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో 50 వేల మార్కు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి తమిళనాడులో రోజురోజుకు విజృంభిస్తోంది. దాంతో అక్కడ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే సాయంత్రానికి 2,147 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటి 50,193కు చేరింది. ఈ రోజు కొత్తగా వచ్చిన కేసులలో 1276 కేసులు చెన్నైలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క చెన్నైలోనే 35, 556 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఈ రోజు కరోనా బారినపడి 48 మంది మృతి చెందారు. మొత్తంగా తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటివరకు 567 మంది కరోనా సోకి చనిపోయారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 27,624 మంది కోలుకున్నారు. మరో 21, 990 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దేశంలో కరోనా కేసులలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో తమిళనాడు ఉంది.

For More News..

ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు

గాంధీభవన్ లో కరోనా కలకలం.. వారం రోజులుగా నాయకులంతా అక్కడే ప్రెస్ మీట్

సీఎం సెక్రటరీకి కరోనా పాజిటివ్

శాసనమండలిలో తొడగొట్టిన మంత్రి అనిల్