
- కరోనా వైరస్ జన్యుపరంగా చేంజ్ అవుతుందన్న చైనా సైంటిస్టులు
- వ్యాక్సిన్ తయారీలో సవాళ్లు తప్పవని ఆందోళన
బీజింగ్ : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుందంట. ఇప్పటికే 30 కంటే ఎక్కువ జాతులుగా ఇది రూపాంతరం చెందిందని చైనా సైంటిస్టుల స్టడీలో తేలింది. కరోనా మహమ్మారి జన్యుపరంగా వివిధ మార్పులకు గురవుతున్నట్లు గుర్తించారు. ఇది మరింత ఆందోళన కలిగించే అంశమే. రూపాలు మార్చుకుంటూ కరోనా మరింత ప్రమాదకారిగా మారుతుంది. ఈ పరిణామం కరోనాను నివారించే క్రమంలో మరిన్ని సమస్యలు తెస్తుందని సైంటిస్టులు చెబుతున్నరాు. హౌంగ్జూలోని బెజియాంగ్ యూనినర్సిటీ ఫ్రొఫెసర్ లి లాంజూవాన్ ఈ స్టడీ చేశారు. మొత్తం 1264 మంది కరోనా బాధితుల్లో 11 మంది నుంచి సేకరించిన నమూనాల్ని అబ్జర్వ్ చేశారు. 30 జాతులుగా మారిన కరోనా లో కొన్ని బలహీనంగా మరికొన్ని బలంగా ఉన్నాయని స్టడీలో గుర్తించారు. బలంగా ఉన్న కరోనా వైరస్ దాదాపు 270 రెట్లు వేగంగా వైరస్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయంట. ఇలాంటి వైరస్ లు సోకిన వారి కణాలపై వైరస్ స్పీడ్ గా ఆటాక్ చేసి వారిని చంపుతోంది.
జన్యుమార్పులను పరిగణలోకి తీసుకోవాలి
వీలైనంతంగా త్వరగా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని లి లాంజూవాన్ తెలిపారు. ఐతే వ్యాక్సిన్ తయారీలో కచ్చితంగా జన్యు మార్పులను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో విజృంభిస్తున్న కోరనా ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో ఎఫెక్ట్ చూపుతోంది. దానికి అనుగుణంగా వ్యాక్సిన్ ఉండాలంటున్నారు. లేదంటే పూర్తి స్థాయిలో కరోనా నివారణ సాధ్యం కాదని చెబుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 70 వ్యాక్సిన్లు పలు దశల్లో తయారీలో ఉన్నాయి. 3 వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగ దశల్లో ఉన్నాయి.