యూఎస్‎లో స్పానిష్‌‌‌‌‌‌‌‌ ఫ్లూ కన్నా కరోనా మరణాలే ఎక్కువ

యూఎస్‎లో స్పానిష్‌‌‌‌‌‌‌‌ ఫ్లూ కన్నా కరోనా మరణాలే ఎక్కువ

యూఎస్: ఫ్లూ కారణంగా మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన అమెరికన్ల కంటే కరోనాతోనే ఎక్కువ మంది అమెరికన్లు మరణించారని జాన్స్ హాప్కిన్స్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ వెల్లడించింది. 1918–19 కాలంలో ఉన్న వాటికంటే ఇప్పుడు వైద్య సౌలతులు ఎన్నో రెట్లు అభివృద్ధి చెందాయి. అప్పట్లో ఫ్లూ కారణంగా 6,75,000 మంది మరణించగా.. ఇప్పుడు కరోనాతో 6,75,722 మంది చనిపోయారని స్టడీలో తేలింది. స్పానిష్ ఫ్లూ మరణాలను మానవ చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటనగా ఎపిడెమియాలజిస్టులు భావించారు. ఫ్లూ మరణాల సంఖ్యను ఇప్పుడు కరోనా దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌‌‌‌‌‌‌‌కు 4.7 మిలియన్ల మంది మరణించారు. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో 5% కాగా ఇందులో అమెరికా వాటా అత్యధికంగా 14 శాతమని పేర్కొంది. 

ఫ్లూతో యువకులే ఎక్కువగా మరణించారు
అమెరికా ప్రస్తుతం కరోనా ఫోర్త్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొంటోంది. డెల్టా వేరియంట్‌‌‌‌‌‌‌‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్​ తీసుకోవడానికి వెనకాడుతుండడం వల్లే ఎక్కువ మరణాలు రికార్డవుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత వైరస్‌‌‌‌‌‌‌‌ పిల్లలు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుండగా.. 1918లో ఫ్లూ కారణంగా చనిపోయిన వాళ్లలో యువకులే ఎక్కువ. అప్పట్లో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకోవడానికి వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్, మందులు అందుబాటులో లేవని సీడీసీ పేర్కొంది. అప్పుడు కూడా ఐసోలేషన్, క్వారంటైన్‌‌‌‌‌‌‌‌, డిసిన్ఫెక్టెంట్ల వాడకం, బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్స్‌‌‌‌‌‌‌‌పై పరిమితులు ఉన్నాయని చెప్పింది. కరోనా వ్యాప్తి అడ్డుకోవడానికి వీటితోపాటు మాస్క్ కూడా పెట్టుకోవాలని రికమండ్ చేసింది. వైరస్ నుంచి రక్షణకు ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయినా నేటికీ యూఎస్‌‌‌‌‌‌‌‌లో 24 % మంది పెద్దలు వ్యాక్సిన ఫస్ట్ డోస్‌‌‌‌‌‌‌‌ తీసుకోలేదు.