ఇండియన్ ఆర్మీలో కరోనా పాజిటివ్ కేసు

ఇండియన్ ఆర్మీలో కరోనా పాజిటివ్ కేసు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి కూడా సోకింది. తాజాగా ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సోల్జర్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కేసు భారత ఆర్మీలో మొదటికేసుగా నమోదైంది. లడఖ్‌లోని లేహ్‌లో విధులు నిర్వహిస్తున్న 34 ఏళ్ల భారత సైనికుడికి కరోనా సోకింది. దాంతో ఇండియన్ ఆర్మీ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వెంటనే సదరు సైనికుడిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ సైనికుడి తండ్రి ఫిబ్రవరి 27న ఇరాన్ నుంచి తిరిగి వచ్చారు. తండ్రి ఇంటికి వచ్చే సమయానికి, ఆ సిపాయి సాధారణ సెలవులో ఉన్నాడు. సెలవులు ముగియడంతో ఆ సైనికుడు మార్చి 2న తిరిగి విధుల్లో చేరినట్లు సమాచారం. ఆర్మీలో ఒకరికి పాజిటివ్ రావడంతో మరెంతమందికి సోకుతుందోనని ఆర్మీ అధికారులు భయపడుతున్నారు.

ఫిబ్రవరి 27న ఇరాన్ నుంచి సైనికుడి తండ్రి ఫిబ్రవరి 29 నుండి లడఖ్ హార్ట్ ఫౌండేషన్‌లో ఐసోలేషన్‌లో నిర్బంధించబడ్డాడు. కాగా.. మార్చి 6న అతనికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మరుసటి రోజు సైనికుడిని కూడా ఐసోలేషన్‌లో ఉంచి సోమవారం పరీక్షలు చేయగా అతనికి కూడా కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దాంతో సైనికుడి సోదరి, భార్య మరియు అతని ఇద్దరు పిల్లలను కూడా ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు.

ఇది ఇలా ఉండగా.. భారత్‌కి చెందిన మరో ఆర్మీ అధికారి కూడా పూణేలోని ఒక సైనిక స్థావరంలో వైరస్ లక్షణాలతో నిర్బంధించబడ్డారు. అతనికి ఇంకా కరోనా పరీక్షలు చేయలేదు. ఇప్పటివరకు భారత్‌లో కరోనా బారిన పడ్డ బాదితుల సంఖ్య 147కి చేరింది. అందులో ముగ్గురు బాదితులు మరణించారు.

For More News..

అభిమానులకు రాంచరణ్ బహిరంగ లేఖ

నేటి నుంచి కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు బంద్

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత

మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. పీక్కుతిన్న చీమలు