చార్ ధామ్ యాత్ర కోసం పాటించాల్సిన కరోనా రూల్స్ 

చార్ ధామ్ యాత్ర కోసం పాటించాల్సిన కరోనా రూల్స్ 

అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో ఉత్తరాఖండ్ చార్ ధామ్. ఈ ​ యాత్ర ఇవాళ్టి(శనివారం) నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్​ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు టీకాను తప్పనిసరి చేసింది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్​, కేదార్​నాథ్​ ఆలయాలకు వచ్చే యాత్రికులు కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నట్లు సర్టిఫికెట్​ను సమర్పించాలని తెలిపింది. వ్యాక్సిన్​ తీసుకోని వారు RTPCR నెగటివ్​ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకుని 15 రోజులు పూర్తయితేనే యాత్రకు అనుమతిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.

 పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రతి రోజూ పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని తెలిపింది ఉత్తరాఖండ్ సర్కారు.  యాత్ర చేపట్టాలనుకునే భక్తులు డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ పోర్టల్, దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.