కరోనా సోకినా సింప్టమ్స్ కనిపించకపోవడానికి కారణమిదే

కరోనా సోకినా సింప్టమ్స్ కనిపించకపోవడానికి కారణమిదే
  • ఎఫెక్ట్​లో తేడాకు కారణం మన డీఎన్ఏలోని జీన్స్
  • అంతర్జాతీయ సైంటిస్టుల స్టడీలో అంచనా
  • 20.50 లక్షల జీనోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను జల్లెడపట్టిన 3 వేల మంది రీసెర్చర్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సోకినా చాలా మందికి సింప్టమ్స్ కన్పిస్తలేవు. కొందరికి మైల్డ్ సింప్టమ్స్ వచ్చి తగ్గిపోతున్నయి. మరికొందరికి మాత్రం మందులు వాడుతున్నా.. పరిస్థితి సీరియస్ అయి ప్రాణాలు పోతున్నయి. ఎందుకిట్లా జరుగుతోంది? అంటే.. మన డీఎన్ఏలోని జీన్స్ తీరే కారణమంటున్నారు సైంటిస్టులు. డీఎన్ఏలోని 13 చోట్ల ఉన్న వేర్వేరు జీన్స్ పనితీరును బట్టే.. కొందరిలో స్వల్ప లక్షణాలతో, మరికొందరిలో తీవ్ర లక్షణాలతో కరోనా ఎఫెక్ట్ ఉంటోందని చెప్తున్నారు. జీన్స్​కు, కరోనా తీవ్రతకు మధ్య లింకును తెలుసుకునేందుకు 25 దేశాల్లోని 3 వేల మంది రీసెర్చర్లు నిరుడు మార్చిలోనే భారీ స్టడీని ప్రారంభించారు. సుమారు 20 లక్షల మంది కరోనా సోకని వాలంటీర్లు, 50 వేల మంది కరోనా పేషెంట్ల జీనోమ్ లను, 46 స్టడీలను వీరు జల్లెడ పట్టారు. దీంతో కరోనాతో 13 జీన్స్ కు లింక్ ఉన్నట్లు తాజాగా అంచనాకు వచ్చారు. వీరి రీసెర్చ్ రిపోర్ట్ గురువారం ‘నేచర్’ జర్నల్ లో పబ్లిష్ అయింది. 

రెండు జీన్స్ పాత్ర కన్ఫామ్..  
కొందరిలో కరోనా ఎఫెక్ట్ ఎక్కువుండటానికి, డీఎన్ఏలోని టీవైకే2 జీన్​కు లింకున్నట్లు రీసెర్చ ర్లు వెల్లడించారు. హెల్తీగా ఉన్నోళ్లలో ఈ జీన్ ఇమ్యూన్ సిగ్నల్స్, ఇన్ ఫ్లమేటరీ సిగ్నల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ముప్పును తగ్గిస్తుందని, కానీ టీబీ ముప్పును పెంచుతుందని గతంలో పలు స్టడీల్లో తేలింది. ఈ జీన్ పనితీరు తగ్గితే కరోనాపై మన శరీరానికి పోరాడే కెపాసిటీ కూడా తగ్గవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. అలాగే ఫాక్స్ పీ4 అనే జీన్ అతిగా పనిచేయడంవల్ల లంగ్ కేన్సర్​కు దారితీసే అవకాశాలు ఉన్నట్లు గతంలో తేలింది. దీనికి కరోనాతో కూడా లింక్ ఉన్నట్లు తాజా రీసెర్చ్​లో అంచనాకు వచ్చారు. ఈ జీన్​ను అణిచివేస్తే.. కరోనాకు ట్రీట్​మెంట్ ఈజీ అవుతుందంటున్నారు.   

కొత్త మందులు కనుక్కోవడానికి..
కరోనాకు ప్రస్తుతం వాడుతున్న మందులను మార్పు లు చేసేందుకు, కొత్తగా పవర్ ఫుల్ మందులను కనుగొనేందుకు తమ రీసెర్చ్ ఉపయోగపడుతుందని స్టడీకి కో ఆథర్​గా వ్యవహరించిన ఫిన్లాండ్ మాలిక్యులర్ మెడిసిన్ డైరెక్టర్ మార్క్ డేలీ చెప్పారు.