
వాషింగ్టన్: అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలపై డీల్ కుదిరిందని, త్వరలో తమ దేశంలో టిక్ టాక్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. టిక్ టాక్ పునరుద్ధరణపై చైనా అధికారులతో అమెరికా అధికారులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయని ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్ వెల్లడించారు.
అమెరికాలో టిక్ టాక్ మళ్లీ తన కార్యకలాపాలు సాగించాలని తమ పౌరులు చాలా మంది కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. అలాగే, ఈ నెల 19న చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో మాట్లాడతానని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది జనవరి 19న టిక్ టాక్ పై అమెరికా బ్యాన్ విధించింది. చైనా ప్రభుత్వ ఒత్తిడితో తమ పౌరుల డేటాను టిక్ టాక్ సేకరిస్తున్నదని పేర్కొంటూ టిక్ టాక్ పై యూఎస్ నిషేధం పెట్టింది.