దేశంలో సగానికిపైగా మరణాలకు కరోనా కారణం కాదు: రష్యా

దేశంలో సగానికిపైగా మరణాలకు కరోనా కారణం కాదు: రష్యా

 

రష్యాలో మరణాలన్నింటికీ కరోనా వైరస్ కారణం కాదని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 60 శాతం మరణాలకు గుండెపోటు, లుకేమియా వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులే కారణమని తేల్చిచెప్పింది. కరోనా కోరల్లో చిక్కుకున్న రష్యాలో ఇప్పుడు కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు మొదటి 10 స్థానాల్లో కనిపించని రష్యా ఇప్పుడు ఏకంగా రెండో స్థానంలో నిలిచింది.

కేసులు సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ మరణాలు మాత్రం అతి తక్కువగా నమోదవుతుండడం అనుమానాలను కలిగిస్తోంది. ప్రభుత్వం కావాలనే మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆరోగ్యశాఖ ఏప్రిల్‌లో కరోనా కారణంగా 639 మంది మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని తెలిపింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 60 శాతం మరణాలకు కరోనా కారణం కాదని స్పష్టం చేసింది. వీటికి గుండెపోటు, లుకేమియా వంటి వ్యాధులే కారణమని వివరించింది.