ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం కరోనా ఐసోలేషన్ సెంటర్
V6 Velugu Posted on May 27, 2021
కరోనా బారిన పడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం రాచకొండ కమిషనరేట్ పరిధి లో అసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. కీట్స్ స్వచ్ఛంద సంస్థ అద్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కలిసి ప్రారంభించారు.
ఈ సెంటర్ లో 30 ఐసోలేషన్ బెడ్స్ ..ఆందులో 7 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని తెలిపారు కమిషనర్ మహేష్ భగవత్. ICR నామ్స్ ప్రకారం సెంటర్ ను ఏర్పాటు చేశామని..ట్రీట్ మెంట్ కోసం రాచకొండ పోలీస్ నెంబర్స్ 9490617131,9490617234 కి డయల్ కు చేయొచ్చని తెలిపారు.రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 1760 కరోనా బారినపడ్డారన్న మహేష్ భగవత్..తాను కూడా కోవిడ్ బారిన పడినట్లు తెలిపారు. ఇంట్లో సదుపాయాలు లేని వాళ్ళు ఈ సెంటర్ ను ఊపయోగించుకోవాల్సిందిగా తెలిపారు.ఈ సెంటర్ లో ఒక ఆంబులెన్స్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. మహేంద్ర లాజిస్టిక్ వారి సహకారం తో ఆక్సిజన్ సిలిండర్ల ను తరలించడానికి ఉచిత ట్రాన్సఫోర్ట్ అందిస్తున్నామన్నారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం ప్రత్యేకంగా ఈ సెంటర్ ను ఏర్పాటు చేసామని తెలిపారు.. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు. ఈ సెంటర్ లో అన్ని ఉచితంగా వసతులు కల్పించామన్నారు. కొవిడ్ విజృంభిస్తున్న క్రమంలో పోలీసులు అందిస్తున్న సేవలు మర్చిపోలేమన్నారు. కాకినాడ నుండి వచ్చిన కీట్స్ స్వచ్ఛంద సంస్థ కు ధన్యవాదాలు తెలిపారు. ఇతర రాష్ట్రాల తో పోలిస్తే మనం కొవిడ్ ను కట్టడి చేస్తున్నామన్నారు. త్వరలోనే రెండో దశ కరోనాను నిర్ములిస్తామన్నారు. ఈ సెంటర్ కు కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం తరపున అందిస్తామన హామీ ఇచ్చారు.
Tagged Rachakonda commissionerate, Corona Isolation Center, Frontline Warriors, Keats charity , Mahesh Bhagwat