దేశంలో వెయ్యికి దిగొచ్చిన కరోనా కొత్త కేసులు

దేశంలో వెయ్యికి దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
  • గడచిన 24 గంటల్లో కొత్త కేసులు 1096: మరణాలు: 81

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. రోజు రోజుకూ కేసులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. కొద్ది రోజులుగా సగటున 1500లోపు కేసులు నమోదు అవుతుండగా..తాజాగా కేసుల సంఖ్య వెయ్యికి పడిపోయింది.  గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1096  కొత్త కేసులు, 81 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 4 లక్షల 65 వేల 904 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1096 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే 81 మంది కోలుకోలేక మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
మరో వైపు 1447 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  4 కోట్ల 24లక్షల 93 వేల 773గా నమోదు అయింది. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉండడంతో యాక్టివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. గడచిన 24 గంటల్లో 13వేల 13 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసుల శాతం 0.03గా నమోదు అయింది. మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 12 లక్షల 75వేల 495 మందికి వ్యాక్సిన్లు వేయగా.. ఇప్పటి వరకు వేసిన వ్యాక్సిన్ల సంఖ్య 184.66కోట్లకు చేరింది. 


ఇవి కూడా చదవండి

దేశంలో కొనసాగుతున్న పెట్రోల్ బాదుడు.. ఇవాళ ఎంతంటే

రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

పోలీసుల అదుపులో రాహుల్ సిప్లిగంజ్

వాహనదారులపై ఆర్టీఏ ఫైన్ల మోత