15 వేలు దాటిన క‌రోనా కేసులు.. 507 మంది మృతి

15 వేలు దాటిన క‌రోనా కేసులు.. 507 మంది మృతి

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఆదివారం ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యానికి మొత్తం కేసుల సంఖ్య 15,712కు చేరింది. అందులో 507 మంది మ‌ర‌ణించ‌గా.. 2231 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 12,974 మంది క‌రోనా బాధితులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 1334 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని, 27 మంది క‌రోనాతో ప్రాణాలు వ‌దిలార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ఉద‌యం వెల్ల‌డించింది.

దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 3651 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు 211 మంది మ‌ర‌ణించ‌గా.. 365 మంది కోలుకున్నారు. ఆ త‌ర్వాత ఢిల్లీలో 1893 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 42 మంది మ‌ర‌ణించారు. చికిత్స అనంత‌రం కోలుకుని 72 మంది డిశ్చార్జ్ అయ్యారు. గుజ‌రాత్ లో 1376 మంది వైర‌స్ బారిన‌ప‌డ‌గా.. 93 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 53 మంది ప్రాణాలు కోల్పోయారు. త‌మిళ‌నాడులో 1372 మందికి క‌రోనా సోక‌గా.. 365 మందికి వ్యాధి న‌య‌మైంది. ప‌దిహేను మంది మ‌ర‌ణించారు. రాజ‌స్థాన్ లో 1351 కేసులు న‌మోద‌య్యాయి. అందులో 183 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 11 మంది మ‌ర‌ణించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 1407 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. వారిలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. 127 మంది పేషెంట్లు కోలుకున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 969 మందికి క‌రోనా సోకింది. అందులో 86 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 14 మంది మ‌ర‌ణించారు. తెలంగాణ‌లో క‌రోనా కేసులు సంఖ్య 809కి చేరింది. వారిలో 186 మంది కోలుకోగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.