హాస్పిటళ్లో ఉరేసుకొని చనిపోయిన కరోనా పేషంట్

హాస్పిటళ్లో ఉరేసుకొని చనిపోయిన కరోనా పేషంట్

హాస్పిటళ్లో కరోనా పేషంట్ సూసైడ్ చేసుకున్న ఘటన బెంగుళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన 60 ఏళ్ల మహిళ..తన కోడలు మరియు మనవడితో కలిసి కరోనా లక్షణాలతో జూన్ 18న కేసీ జనరల్ ఆస్పత్రిలో చేరింది. వారికి కరోనా పాజిటివ్ రావడంతో వారందరికీ కేసీ జనరల్ హాస్పిటళ్లో చికిత్స చేస్తున్నారు. అయితే గురువారం రాత్రి రెండు గంటల సమయంలో వృద్ధురాలు వాష్ రూం కోసం వెళ్లి చాలాసేపయినా రాలేదు. దాంతో ఆమె కోడలు.. అత్తను వెతుకుతూ వాష్ రూంకి వెళ్లింది. అప్పటికే అత్త ఉరేసుకొని చనిపోయింది. కోడలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎందుకు ఉరివేసుకుందో తమకు తెలియదని ఆమె కుటుంబసభ్యులు అంటున్నారు.

For More News..

టైం అయిపోయినా షాపు మూయలేదని తండ్రీ కొడుకులని కొట్టి చంపిన పోలీసులు

ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్