నటుడు, రచయిత పోసానికి కరోనా

V6 Velugu Posted on Jul 29, 2021

  • రెండు పెద్ద సినిమాల షూటింగ్ వాయిదా పడే అవకాశం
  • తనను మన్నించమని దర్శక నిర్మాతలను కోరిన పోసాని

హైదరాబాద్: ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేరారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు పోసాని. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని  కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 
ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులతో దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్ లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి ఒక ప్రకటనలో తెలిపారు.

Tagged Hyderabad Today, Posani Krishna Murali, , tollywood today, Corona Positive for actor Posani, actor and writer Posani updates, hospitalized due to covid 19, treatment undergoes

Latest Videos

Subscribe Now

More News