ఏవియేషన్‌ మినిస్ట్రీ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌

ఏవియేషన్‌ మినిస్ట్రీ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌
  • సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు మిగతా సిబ్బంది
  •  రాజీవ్‌గాంధీ భవన్‌ను సీల్‌ చేసిన అధికారులు

న్యూఢిల్లీ: మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి బుధవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం రోజు టెస్ట్‌ రిజల్ట్స్‌ వచ్చాయని అధికారులు చెప్పారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఈ నెల 15న డ్యూటీకి హాజరుకావడంతో ఆతడితో కాంటాక్ట్‌ అయిన సిబ్బందిని సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించామని ఏవియేషన్‌ మినిస్ట్రీ ప్రకటించింది. ఏమియేషన్‌ మినిస్ట్రీ ఆఫీస్‌ (బీ) వింగ్‌.. రాజీవ్‌ గాంధీ భవన్‌ను సీల్‌ చేసిన అధికారులు బిల్డింగ్‌ను శానటైజ్‌ చేశారు. “ కరోనా పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగిని మేం అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఆయన ట్రీట్‌మెంట్‌కు హెల్ప్‌ చేస్తాం. ముందు జాగ్రత్తగా ఆయనతో కాంటాక్ట్‌ అయిన స్టాఫ్‌ అందరినీ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లమని చెప్పాం” అని సివిల్‌ ఏవియేషన్‌ మినిస్టర్‌‌ హర్దీప్‌ సింగ్‌ పూరీ ట్వీట్‌ చేశారు.