Karnataka: తొక్కిసలాటలపై కొత్త చట్టం..భారీ జరిమానా, మూడేళ్ల జైలు

Karnataka:  తొక్కిసలాటలపై కొత్త చట్టం..భారీ జరిమానా, మూడేళ్ల జైలు

ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరు చినస్వామి స్టేడియంలో తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే..మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతోంది. కర్ణాటక జన సమూహ నియంత్రణ బిల్లు- 2025(Crowd Control Bill 2025) అనే కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశంలో సిద్దరామయ్య సర్కార్ ఈ ముసాయిదా బిల్లుపై చర్చించింది. 

ఈ బిల్లు ప్రకారం.. కర్ణాటకలో రాజకీయ ర్యాలీలు, సమావేశాలు  ప్రాయోజిత కార్యక్రమాలు,సామూహిక సమావేశాలలో తొక్కిసలాంటి ఘటనలకు  తప్పనిసరి అనుమతి. ఎవరైనా  జనసమూహాన్ని నియంత్రించడంలో విఫలం అయినా.. లేదా పరిహారంలో విఫలం అయినా వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.  ఈ చట్టాన్ని ఉల్లంఘించిన  వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ  జరిమానా విధించనుంది.  

అయితే ఈ బిల్లు జాతరలు, రథోత్సవాలు , పల్లకీ ఊరేగింపులు, పడవల పండుగలు (తెప్పాడ తేరు లేదా తెప్పోత్సవం), ఉర్స్ (ఉరుస్ అని కూడా పిలుస్తారు) కార్యక్రమాలు, ఇతర మతపరమైన వేడుకలు వంటి సాంప్రదాయ,మతపరమైన సమావేశాలకు మినహాయింపు ఇస్తుంది.

జూన్ 4న బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది యువకులు చనిపోగామరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.   తొక్కిసలాటకు బీసీసీఐ, ఆర్సీబీ ఫ్రాంఛైజ్ ప్రధాన కారణమని కర్నాకట ప్రభుత్వం ఆరోపించింది. ఆర్సీబీ వియోజత్సవ ర్యాలీకి  ఫ్రాంచైజ్ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోరలేదని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే..