
దేశంలో కరోనా నియంత్రణకు పోరాడుతున్న భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధికారి కరోనా బారిన పడ్డారు. ICMR డీజీ ప్రొఫెసర్ బలరాం భార్గవకు కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో బలరాం భార్గవకు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.