హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి కరోనా సోకింది. బుధవారం ఆయన ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు పార్టీ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారని..ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పింది. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని చాడ వెంకటరెడ్డి రిక్వెస్ట్ చేశారని చెప్పింది రాష్ట్ర పార్టీ కార్యాలయం.
