49.95 శాతానికి పెరిగిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

49.95 శాతానికి పెరిగిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో క‌రోనా పేషెంట్ల రివ‌క‌రీ రేటు క్ర‌మంగా పెరుగుతోంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గ‌డిచిన 24 గంటల్లో 7,135 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,08,993 క‌రోనా కేసులు న‌మోదు కాగా, వారిలో 1,54,329 మంది పేషెంట్లు క‌రోనా నుంచి కోలుకున్నార‌ని శ‌నివారం తెలిపింది. దీంతో దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 49.95 శాతానికి పెరిగింద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల క‌న్నా కోలుకున్న వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొంది. శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,45,779 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది.