క్షణాల్లో కరోనా రిజల్ట్‌‌‌‌‌‌‌‌.. వాసనతో పట్టేస్తున్న ఆర్మీ డాగ్స్

V6 Velugu Posted on Feb 10, 2021

  • ఇప్పటికే 22 పాజిటివ్‌‌‌‌‌‌‌‌ కేసులు గుర్తించాయన్న ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: టెక్నాలజీ ఎంతగా డెవలప్‌‌‌‌‌‌‌‌ అవుతున్నా.. కరోనా శాంపిల్‌‌‌‌‌‌‌‌ తీసుకుని టెస్ట్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడానికి సుమారు గంట సమయం పడుతోంది. కానీ, ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆర్మీ కొత్త ప్రయోగం చేసింది. తమ వద్ద ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న రెండేండ్ల వయసున్న కాస్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే ఇండియన్ ఆర్మీకి చెందిన కాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పానియెల్‌‌‌‌‌‌‌‌, జయ అనే ఒక సంవత్సరం వయసున్న ఇండియన్‌‌‌‌‌‌‌‌ చిప్పిపరయ్‌‌‌‌‌‌‌‌ డాగ్స్‌‌‌‌‌‌‌‌కు కరోనా టెస్టింగ్‌‌‌‌‌‌‌‌పై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఇప్పుడు అవి కొన్ని సెకండ్లలోనే రిజల్ట్‌‌‌‌‌‌‌‌ను చెప్పేస్తున్నాయి. ఈరోజు వరకు ఆ రెండు డాగ్స్‌‌‌‌‌‌‌‌ 3,800 శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి 22 పాజిటివ్‌‌‌‌‌‌‌‌ కేసులను గుర్తించాయి. అయితే ఆ శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ యూరిన్‌‌‌‌‌‌‌‌ లేదా చెమట మాత్రమే అయ్యుండాలి. పోయిన ఏడాది సెప్టెంబరులో ఆర్మీలో కరోనా కేసులు భారీగా నమోదైనప్పటి నుంచి ఆ రెండు డాగ్స్‌‌‌‌‌‌‌‌కు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు.  పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో చెప్పిన డేటా ప్రకారం, సెప్టెంబరు 2020 వరకు ఇండియన్ ఆర్మీలో 16 వేల కేసులతో కలిపి ఆర్మ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌లో సుమారు 20 వేల మందికి కరోనా సోకింది. మణి అనే మరో డాగ్‌‌‌‌‌‌‌‌తో సహా మొత్తం 8 డాగ్స్‌‌‌‌‌‌‌‌ త్వరలోనే వీటితో కలవనున్నాయని సీనియర్ ఆర్మీ ఆఫీసర్ చెప్పారు. కరోనా సోకిన వారిని గుర్తించడానికి ఇండియాలో తొలిసారి డాగ్స్‌‌‌‌‌‌‌‌ను యూజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి వీటి వినియోగం ఆర్మీ వరకే ఉండనుంది.

ఇవి కూడా చదవండి

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది

V6 వెలుగు’ కథనాన్ని పిల్ గా తీసుకోండి

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు..?

Tagged Covid-19, corona, Treatment, Army dogs, moments, new method, recognizing, results, smell

Latest Videos

Subscribe Now

More News