కరోనా టెస్టుకు శాంపిల్ ఇస్తుండగా ప్రసవించిన మహిళ

కరోనా టెస్టుకు శాంపిల్ ఇస్తుండగా ప్రసవించిన మహిళ

హుజూర్ నగర్, వెలుగు: కరోనా పరీక్షలు చేస్తుండగానే పురిటినొప్పులు వచ్చి ఓ మహిళ ప్రసవించిన ఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ లో జరిగింది. మండల పరిధిలోని గోపాలపురానికి చెంది న తెప్పని ప్రభావతికి నెలలు నిండడంతో ప్రసవం కోసం ఉదయం 7 గంటలకు హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు భర్తతో కలిసి వచ్చింది. డెలివరీ చేయడానికి ముందు తప్పనిసరి గా కరోనా టెస్టు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. దాంతో అదే హాస్పిటల్ లో కోవిండ్ సెంటర్ కు వెళ్లింది . కరోనా టెస్ట్కిట్ ద్వారా శాంపిల్ సేకరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో ఆ ప్రాంతంలోనే ప్రసవించింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. వెంటనే సిబ్బంది వారిని జనరల్ వార్డుకు తరలించారు.

220 మందికి కరోనా పాజిటివ్

యాదాద్రి/కోదాడ/మిర్యాలగూడ, వెలుగు : జిల్లాలో శుక్రవారం 220 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. యాదాద్రి జిల్లాలో 133 మందికి, కరోనా కన్ఫర్మ్ కాగా, జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,815కు చేరుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ ఏరియా హాస్పిటల్ చేసిన టెస్టుల్లో 32 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే నల్గొండ జిల్లా మిర్యాల గూడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తో పాటు దామర చర, ్లఅడవిదేవులపల్లి, వేములపల్లి, మాడ్గులపల్లిలో 55 మందికి కన్ఫర్మ్ అయింది.