అమెజాన్‌లో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లు!

అమెజాన్‌లో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లు!

కరోనా వైరస్ రోజురోజుకూ దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా ఆస్పత్రులకు పరుగుతీస్తున్నారు. అయితే అక్కడ మాత్రం అందరికీ వైద్య పరీక్షలు చేయడంలేదు. దాంతో చాలామంది చేసేదేమీలేక వెనుదిరుగుతున్నారు. అయితే ఇప్పుడు అటువంటి చింత అక్కర్లేదు. మీకు వైరస్ లక్షణాలు ఉన్నయో లేవో ఇంట్లోనే ఉండి తెలుసుకోవచ్చు. అందుకోసం కావలసిన కిట్లు ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో త్వరలోనే లభ్యంకానున్నాయి.

నేషనల్ ఇన్ఫెక్షన్ సర్వీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ షరోన్ పీకాక్ మాట్లాడుతూ.. ‘కరోనావైరస్ హోమ్ టెస్టింగ్ కోసం ఫింగర్ ప్రిక్ కిట్లు అమెజాన్ మరియు ఇతర UK రిటైలర్ స్టోర్స్‌లో కొద్ది రోజుల్లో లభిస్తాయి. ఇది మనందరికి మంచి శుభవార్త. ఫింగర్ ప్రిక్ కిట్లను UKలో మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు ధృవీకరించారు. ఇప్పటివరకు ఆ కిట్లతో 3.5 మిలియన్ల పరీక్షలు చేశాం. ఫింగర్ ప్రిక్ కిట్ల ద్వారా ఫలితాలు కేవలం 15 నిమిషాలలోనే వస్తాయి. వీటి ద్వారా ప్రజలు ఇంట్లోనే కరోనావైరస్, యాంటీబాడీ పరీక్షలను చేసుకోవచ్చు. ఈ కిట్లను మొదట ఆక్స్‌ఫర్డ్‌లో పరీక్షించి.. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ఈ వారంలో ఫింగర్ ప్రిక్ కిట్లపై మరిన్ని పరీక్షలు చేసి మరో వారంరోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. కరోనా పరీక్ష కోసం ఎవరూ ఆస్పత్రికి వెళ్లొద్దనేదే మా లక్ష్యం’ అని తెలిపారు.

యూకేలో ఇప్పటివరకు 90,436 మందికి కరోనావైరస్ పరీక్షలు చేశారు. వచ్చే నాలుగు వారాల్లో మరో 25 వేల మందిని పరీక్షించాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

For More News..

కరోనా నివారణకు రూ. రెండు కోట్ల విరాళం

తెలంగాణలో పెరిగిన పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా టోల్‌ట్యాక్స్‌ రద్దు