సిరిసిల్ల ఒమిక్రాన్ పేషెంట్ తల్లి, భార్యకు కరోనా

సిరిసిల్ల ఒమిక్రాన్ పేషెంట్ తల్లి, భార్యకు కరోనా

రాజన్న సిరిసిల్ల జిల్లా  ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో  ఒమిక్రాన్ కాంటాక్టుల్లో ఇవాళ (బుధవారం) మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే వారిలో ఒమిక్రాన్ లక్షణాలు లేవని..వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపనున్నట్లు తెలిపారు వైద్యాధికారి సంజీవరెడ్డి. 

గూడెం గ్రామాని చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తికి   ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని  టిమ్స్ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు  డాక్టర్లు. ఇప్పుడు ఆయన తల్లికి, భార్యకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ గ్రామాన్ని సందర్శించిన  వైద్యాధికారి బాధితులకు మనోధైర్యం కల్పించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

విదేశాల నుంచి వచ్చిన తొమ్మిది మందికి ఒమిక్రాన్