కేన్సర్ పేషెంట్లకు కరోనా వ్యాక్సిన్లు​ సేఫ్​

కేన్సర్ పేషెంట్లకు కరోనా వ్యాక్సిన్లు​ సేఫ్​
  • యూరోపియన్​ సొసైటీ ఫర్​ మెడికల్​ ఆంకాలజీ వెల్లడి

లండన్: కరోనా వ్యాక్సిన్లను కేన్సర్​​పేషెంట్లు తీసుకోవచ్చని యూరోపియన్​ సొసైటీ ఫర్​ మెడికల్​ ఆంకాలజీ రీసెర్చర్లు వెల్లడించారు. వాటి వల్ల ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్​ ఉండవన్నారు. బూస్టర్​ డోస్​ను కూడా వీళ్లు తీసుకోవచ్చని, దీని వల్ల కరోనా నుంచి రక్షణ మరింత పెరుగుతుందని తెలిపారు. గతంలో వ్యాక్సిన్  ట్రయల్స్​లో కేన్సర్​ పేషెంట్లను చేర్చకపోవడంతో వాళ్లకు వ్యాక్సిన్లు సేఫా కాదా, వేసుకున్నా కరోనా నుంచి రక్షణ ఉంటుందా లేదా అని అనుమానం నెలకొంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్​లోని 4 జిల్లాల్లో 791 మంది పేషెంట్లపై ట్రయల్స్​ ప్రారంభించారు. వీళ్లలో కేన్సర్​ లేని వాళ్లు, కేన్సర్ కు కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, రెండు థెరపీలతో ట్రీట్​మెంట్​ చేయించుకున్న వాళ్లు ఉండేలా చూసుకున్నారు. వీళ్లకు మోడెర్నా రెండు డోసులిచ్చి పరిశీలించారు. రెండో డోసు ఇచ్చిన 28 రోజుల తర్వాత అన్ని రకాల పేషెంట్లలో యాంటీబాడీలు గుర్తించినట్టు రీసెర్చర్లు తెలిపారు. ఇంతకముందే కరోనా సోకిన వాళ్లలో యాంటీబాడీలు మరింత బలంగా తయారయ్యాని చెప్పారు. వ్యాధి లేని వాళ్లలోనూ ఇంత మొత్తంలోనే యాంటీబాడీలు ఉంటాయన్నారు. ఫైజర్​ వ్యాక్సిన్​ను కూడా 232 మంది పేషెంట్లపై పరిశీలించగా ఇలాంటి ఫలితాలే వచ్చాయని చెప్పారు.

పిల్లలపై కొవాగ్జిన్ ఫేజ్​ 2 ట్రయల్స్ ​పూర్తి

హైదరాబాద్: 18 ఏండ్లలోపు పిల్లలపై కొవాగ్జిన్​ రెండో దశ ట్రయల్స్​ పూర్తయ్యాయని భారత్​బయోటెక్​ చైర్మన్, మేనేజింగ్​ డైరెక్టర్​ కృష్ణ ఎల్ల వెల్లడించారు. ట్రయల్స్​ వివరాలను పరిశీలిస్తున్నామని, వచ్చే వారం డీసీజీఐకి డేటా  అందిస్తామని చెప్పారు. కరోనా ఇంట్రానాసల్​(ముక్కు ద్వారా ఇచ్చేది) వ్యాక్సిన్​ ఫేజ్​ 2 ట్రయల్స్​ కూడా వచ్చే నెలలో పూర్తవుతాయన్నారు. ఈ వ్యాక్సిన్​వల్ల ముక్కులోనే కరోనాను అడ్డుకునే ఇమ్యూనిటీ వస్తుందన్నారు. ఇంట్రానాసల్​ ట్రయల్స్​ను 650 మంది వలంటీర్లపై చేశామన్నారు. సెప్టెంబర్​లో వ్యాక్సిన్​ఉత్పత్తి 3.5 కోట్లు ఉంటుందని, అక్టోబర్​లో 5.5 కోట్లకు చేరుతుందని తెలిపారు.