ఇండిపెండెంట్స్‌ డే ఈవెంట్‌కు కరోనా వారియర్స్‌!

ఇండిపెండెంట్స్‌ డే ఈవెంట్‌కు కరోనా వారియర్స్‌!

ఆప్ సర్కార్‌‌ నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా వారియర్స్ మహమ్మారిపై పోరులో ముందుండి పోరాడుతున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు అందిస్తున్న సేవలు అపురూపమనే చెప్పాలి. అందుకే కరోనా వారియర్స్‌ను ఇండిపెండెంట్స్‌ డే ఈవెంట్‌కు పిలవాలని ఢిల్లీలోని ఆప్ సర్కార్ నిర్ణయించింది. ఛత్రసాల్ స్టేడియంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా ఢిల్లీ సెక్రటేరియట్‌లో నిర్వహించననున్నారు. ఈ ఫంక్షన్‌లో ఎలాంటి కల్చరల్ ప్రోగామ్స్‌ ఉండబోవని ఆ రాష్ట్ర మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. అత్యంత జాగ్రత్తల మధ్య జరగనున్న ఈవెంట్‌లో కేవలం 80–100 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానాలు పంపారని సమాచారం. వీరిలో కేబినెట్ మినిస్టర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టాప్ అఫీషియల్స్ ఉన్నారని తెలిసింది.

‘కరోనా వైరస్ కారణంగా ఆగస్టు 15 ఈవెంట్‌కు పరిమిత స్థాయిలో గెస్ట్‌లను పిలుస్తున్నాం. వీరిలో కరోనా వారియర్స్‌ కూడా భాగమవనున్నారు. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న డాక్టర్స్‌, నర్సులు, పోలీసు అధికారులు, శానిటైజేషన్ వర్కర్స్, అంబులెన్స్ డ్రైవర్స్, ప్లాస్మా డోనర్స్‌ను గౌరవించాలి. ఆపత్కాలంలో అందించిన సేవలకు గాను వీరిని ఈ ఈవెంట్‌కు ఆహ్వానిస్తున్నాం’ అని గోపాల్ రాయ్ ప్రస్ఫుటం చేశారు.