ఏపీలో మళ్లీ బుసకొడుతున్న కరోనా...

V6 Velugu Posted on Apr 22, 2021


అమరావతి: కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ ఉధృతం అవుతోంది. తగ్గినట్లేతగ్గి మళ్లీ కోరలు చాస్తోంది. ఇవాళ గురువారం ఒక్కరోజే 11 వేల కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 10,759 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వల్ల 31 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,541 గా ఉన్నట్లు ప్రకటించింది. 3,992 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,97,462 లక్షల మంది కరోనా బారిన పడగా.. 9,22,977 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 66,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7,541 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Tagged AP, Andhra Pradesh, corona cases, Covid Cases, Health Bulletin, latest updates, , Single-Day Spike

Latest Videos

Subscribe Now

More News