ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 2,76,398 కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 2,76,398 కరోనా కేసులు

కరోనావైరస్ ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 2,76,398 కేసులు నమోదయినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అదేవిధంగా 6,933 మంది కరోనా బారినపడి చనిపోయినట్లు తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 20,439,814 కేసులు నమోదయ్యాయని.. అదేవిధంగా 7,44,385మంది కరోనాతో చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో 64,15,476 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 1,39,11,414 కు చేరింది. అత్యధిక కరోనా కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అక్కడ 54,15,666 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బ్రెజిల్ 32,29,621 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఇండియా 24,59,613 కేసులతో మూడో స్థానంలో ఉంది. కరోనావైరస్ ను ప్రపంచ మహమ్మారిగా మార్చి 11న డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన విషయం తెలిసిందే.

For More News..

అమెరికా రండి.. జాబ్‌ చేసుకోండి

వచ్చే ఏడాది నుంచి అందరికీ ఈ-పాస్ పోర్ట్

ప్రధానిగా మోడీ కొత్త రికార్డు