అమెరికాలో 7.10 లక్షలు దాటిన కరోనా కేసులు

అమెరికాలో 7.10 లక్షలు దాటిన కరోనా కేసులు
  • 37 వేల మందికి పైగా మృతి
  • న్యూయార్క్ లోనే సగం మరణాలు నమోదు

వాషింగ్టన్: అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7.10 లక్షలు దాటింది. 37 వేల మందికిపైగా మరణించారు. కరోనాకు కేంద్రంగా మారిన ప్రపంచ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన న్యూయార్క్ లో 14 వేల మందికిపైగా చనిపోగా, రెండు లక్షల మందికి కరోనా సోకింది. అమెరికాలో మొత్తం మృతుల సంఖ్యలో సగం న్యూయార్క్ లోనే నమోదయ్యాయి. న్యూజెర్సీలో 78 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా 3,800 మంది మరణించారు. శుక్రవారం నాటికి 37.8 లక్షల మందికి టెస్టులు చేసినట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోనే అడ్వాన్స్ డ్ టెస్టింగ్ సిస్టమ్ తమ వద్ద ఉందన్నారు. న్యూయార్క్, లూసియానాలో ఎక్కువ మందికి టెస్టులు చేసినట్లు చెప్పారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోకుంటే మృతుల సంఖ్య లక్ష నుంచి రెండు లక్ష దాకా ఉండేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మృతుల సంఖ్య 65 వేల వరకు చేరే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచంలోని 184 దేశాల్లో ఈ కరోనా వ్యాధి ఉందని, దీనిపై యుద్ధంలో తమ సైంటిస్టులు అంతిమ విజయం సాధిస్తారని అన్నారు.