
తెలంగాణలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. రాబోయే నాలుగైదు వారాల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉందని అన్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్పా ఇంట్లో నుంచి ఎవరూ బయటతిరగొద్దని చెప్పారు. ప్రథమ నగరలాతో పాటు ద్వితీయ నగరాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోందని, కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా పేషెంట్లకు వెంటనే చికిత్స చేస్తే మంచిదని తెలంగాణ డీఎంఈ రమేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.