పాలమూరు యూనివర్సిటీలో డిగ్రీ ఫలితాలు విడుదల

పాలమూరు యూనివర్సిటీలో డిగ్రీ ఫలితాలు విడుదల

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో గత మే, జూన్  నెలల్లో జరిగిన డిగ్రీ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్  రమేశ్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ  మాట్లాడుతూ డిగ్రీ రెగ్యులర్  రెండవ సెమిస్టర్  బీఏలో 31.45 శాతం, బీకాంలో 36.86 శాతం, బీఎస్సీలో 29.74 శాతం, నాలుగవ సెమిస్టర్  బీఏలో 51.36 శాతం, బీకాంలో 43.57 శాతం, బీఎస్సీలో37.63 శాతం, ఆరవ సెమిస్టర్  బీఏలో 52.27 శాతం, బీకాంలో 54.57 శాతం, బీఎస్సీలో 55.58 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

 ఐదవ సెమిస్టర్​ బ్యాక్ లాగ్  బీఏలో 52.88 శాతం, బీకాంలో 54,49 శాతం, బీఎస్సీలో 46.51 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. పరీక్షల నియంత్రణ అధికారి కె ప్రవీణ, అకడమిక్  ఆడిట్  సెల్  డైరెక్టర్  చంద్రకిరణ్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు శాంతిప్రియ, అనురాధ రెడ్డి, ఎగ్జామినేషన్  కో ఆర్డినేటర్  అరుంధతి రెడ్డి పాల్గొన్నారు.