కరోనా ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుంది

కరోనా ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుంది

కరోనా వైరస్  ప్రభావం  దశాబ్దాల వరకు ఉంటుందన్నారు WHO డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌. చైనాలో కరోనా వ్యాప్తి గురించి ప్రపంచానికి తెలిసి 6 నెలలు గడిచిన సందర్భంగా అత్యవసర విభాగం సమావేశమై కరోనాపై చర్చించింది. చైనా వెలుపల 100 కేసులు, మరణాలే లేని సమయంలో ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించాల్సి వచ్చిందని అధానోమ్‌ చెప్పారు. ఇలాంటి వైరస్‌లు 100 ఏళ్లలో ఒకసారి బయటపడతాయన్నారు. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందన్నారు. కరోనా విషయంలో శాస్త్ర సంబంధమైన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. ఈ విషయంలో ఇప్పటికీ ఎన్నో వాటికి సమాధానం దొరకాల్సి ఉందని చెప్పారు. చాలా మందికి వైరస్‌ ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలిందని వివరించారు అధానోమ్.