పోయిన ఏడాది ఆగస్టులోనే చైనాలో కరోనా: హార్వార్డ్‌ రిసెర్చ్‌

పోయిన ఏడాది ఆగస్టులోనే చైనాలో కరోనా: హార్వార్డ్‌ రిసెర్చ్‌
  •  ఖండించిన చైనా

వాషింగ్టన్‌: కరోనావైరస్ 2019 ఆగస్టు నుండి చైనాలో వ్యాప్తి చెంది ఉండవచ్చు అని హార్వర్డ్ పరిశోధన తెలిపింది. హాస్పిటల్స్‌ దగ్గర్లోని శాటిలైట్‌ ఫొటోలు, సెర్చ్‌ ఇంజిన్‌ డేటా బేస్‌ ఆధారంగా రిపోర్ట్‌ తయారు చేశామని చెప్పింది. అయితే చైనా మాత్రం ఆ రిపోర్ట్‌ను ఖండించింది. వైరస్‌ పుట్టిన వూహాన్‌ హాస్పిటల్స్‌ దగ్గర పార్కింగ్‌ లాట్స్‌ శాటిలైట్‌ ఫొటోలను చూశామని, అంతే కాకుండా డయేరియా, దగ్గుకు సంబంధించి లక్షణాల గురించి సెర్చ్‌ చేశారని దాని ఆధారంగా రిపోర్ట్‌ తయారు చేశామని రిసెర్చ్‌ చేసిన వారు చెప్పారు. ఇంతకు ముందు సీజన్ల కంటే భిన్నంగా ఆగస్టులో ఈ పదాల కోసం ఎక్కువగా వెతికారని రిసెర్చ్‌ ద్వారా వెల్లడైంది. దీంతో అప్పటి నుంచే వైరస్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వూహాన్‌ మార్కెట్‌లో కరోనాను గుర్తించే సమయానికే వైరస్‌ వ్యాప్తి మొదలైందనే వాదనకు తమ దగ్గర ఉన్న ఆధారాలు మద్దతిస్తున్నాయని చెప్పింది.