
కరోనా వచ్చిన వారితో డైరెక్ట్‌గా ఐ కాంటాక్ట్ అయినా కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దగ్గు, జ్వరం, జలుబు కాకుండా ఈ సెకండ్ వేవ్‌లో కళ్లతో కూడా కరోనా వస్తుందంటున్నారు. కళ్ళు ఎరుపు ఎక్కడం, పొడిబారడం వంటివి జరుగుతాయని డాక్టర్లు అంటున్నారు. ఐ సైట్ ఉన్నవాళ్లకు కరోనా వస్తే కంటి చూపు మరింత తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మొదటివేవ్‌లో కరోనా సోకిన వారిలో కళ్లు ఎరుపెక్కడం, పొడిబారడం, కంటి నుంచి నీళ్లు కారడం వంటి లక్షణాలుండేవని వైద్యులు అంటున్నారు. అటువంటి వారిలో కొంతమందికి చూపు తగ్గిందని.. మరికొంతమందికి చికిత్సతో నయమైందని డాక్టర్లు అంటున్నారు. ఇప్పుడు సెకండ్‌వేవ్‌లో కండ్ల కలక కూడా ఒక కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కళ్లతో కూడా సోకే ప్రమాదముందని.. అందుకే కళ్లజోడు ధరిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
షుగర్ పేషంట్లు బహిరంగ సమావేశాలకు, గుంపులుగుంపులుగా ఉండేవాళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీరికి కరోనా తొందరగా అవకాశాలున్నాయని.. షుగర్ పేషంట్ల ఇమ్యూనిటి తగ్గడమే ఇందుకు కారణమని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా షుగర్ లెవల్స్ ఎల్లప్పుడూ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.