కరోనా లక్షణాలు లేకున్నా టెస్ట్ లు

కరోనా లక్షణాలు లేకున్నా టెస్ట్ లు

హైదరాబాద్, వెలుగు: కరోనా పాజిటివ్ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌‌‌‌ పర్సన్స్‌‌‌‌కు తప్పని సరిగా టెస్టులు చేయించాలని సర్కారు నిర్ణయించింది.  సోమవారం వైరస్ పాజిటివ్‌‌‌‌గా తేలిన 61 మందితో సుమారు 900 మంది కాంటాక్ట్ అయినట్టు అధికారులు గుర్తించారు. వారందరి కీ టెస్టులు చేయించేందుకు హెల్త్ డిపార్టుమెంట్  ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి కరోనా సోకినా కూడా చాలా మందిలో లక్షణాలు బయటపడటం లేదు. వాళ్లు నార్మల్‌‌‌‌గానే ఉన్నామనుకుని బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇతరులకు వైరస్ వ్యాపిస్తోంది. చాలా కేసుల విషయంలో ఇలాగే జరిగిందని సర్వేలైన్స్  ఆఫీసర్లు చెప్తున్నారు. ఏ మాత్రం తెలియకుండానే.. షాద్‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఓ మహిళ కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమెకు కరోనా అంటించిన బీహార్ వ్యక్తికి అసలు వైరస్ లక్షణాలే లేకపోవడం గమనార్హం.  ఆ మహిళకు వైరస్‌‌‌‌ఎక్కడి నుంచి సోకిందో తెలుసుకునేందుకు.. ఆమె ఇంట్లో కిరాయికి ఉంటున్న నలుగురు బీహార్ యువ కులకు టెస్టులు చేయించారు. వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. రెం డ్రోజుల కింద ఆ మహిళ భర్తకు కూడా వైరస్ పాజిటివ్‌‌‌‌గా తేలింది. ఇలా తమకు వైరస్ సోకిందని తెలియకుండానే చాలా మంది ఇతరులకు వైరస్ అంటిస్తున్నారు. హైద రాబాద్పాత బస్తీలో ఓ కుటుంబంలో నలుగురికి ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ పాజిటివ్ వచ్చింది. మొదట ఆ కుటుంబంలో ఒకరికి వైరస్ పాజిటివ్ రావడంతో ఇంట్లోవాళ్లందరికీ టెస్టులు చేయించారు. అందరికీ వైరస్‌ ‌‌‌ఉన్నట్టు తేలింది. ఇలా సింప్టమ్స్‌‌‌‌లేని కేసులు ఎక్కువగా ఉంటుం డటంతో.. పాజిటివ్ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ ‌‌‌వ్యక్తులందరికీ టెస్టులు చేయించాలని అధికారులు నిర్ణయించారు.