వచ్చే నెలకల్లా వ్యాక్సిన్ రెడీ.. రష్యా ధీమా!

వచ్చే నెలకల్లా వ్యాక్సిన్ రెడీ.. రష్యా ధీమా!

న్యూఢిల్లీ: కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్నందున వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి యత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియాలోని ప్రముఖ ఫార్మా దిగ్గజాలతోపాటు ప్రపంచంలోని చాలా కంపెనీలు వ్యాక్సిన్‌ పరిశోధనలో తలమునకలై ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌, భారత్ బయోటెక్‌లు ఆ దిశగా వేగంగా దూసుకెళ్తున్నాయి. వీటిల్లో వ్యాక్సిన్ టెస్టింగ్ వివిధ దశల్లో ఉంది. మరోవైపు రష్యన్ వ్యాక్సిన్ అవసరమైన రెండు కీలక క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసిందని తెలిసింది. ఇప్పుడు మూడో దశ ట్రయల్స్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తోంది. తద్వారా ప్రజలకు అందుబాటులో రానున్న మొదటి కరోనా వ్యాక్సిన్ ఇదే కానుందని సమాచారం.

రెండు దశల వ్యాక్సిన్ ట్రయల్స్‌ పూర్తయ్యాయని, ఫస్ట్ బ్యాచ్ పేషెంట్స్‌ను కూడా డిశ్చార్జ్ చేశామని రష్యా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ గురించి మరో అప్‌డేట్ తెలిసింది. ఎక్స్‌పర్ట్స్‌ నుంచి అందిన సమాచారం ప్రకారం.. పేరు తెలపని ఓ క్యాండిడేట్‌పై వ్యాక్సిన్‌కు సంబంధించిన ఫేజ్–3 టెస్టింగ్స్‌ను రష్యా మొదలుపెట్టనుందని తెలిసింది. అలాగే దీన్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ యడాఎమిరేట్స్‌లోశ్య వేగవంతం చేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మూడో దశ టెస్టింగ్స్‌ను చాలా కీలకంగా చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వచ్చే నెలలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని రష్యన్ ఎపిడెమియాలజిస్టులు ఆశాభావం వ్యక్తం చేశారు.