మూడు నెలల్లో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్

మూడు నెలల్లో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 3 నుంచి 4 నెలల్లో వ్యాక్సిన్‌‌ అందుబాటులోకి వస్తుందన్నారు. కరోనా అనంతరం హెల్త్ కేర్ అంశంపై ఫిక్కీ ఎఫ్‌‌ఎల్‌‌వో వెబినార్‌‌లో పాల్గొన్న హర్ష వర్దన్ వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. ‘మరో మూడు నుంచి నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని నమ్మకంగా ఉన్నా. సైంటిఫిక్ డేటాను అనుసరించి టీకా పంపిణీ జరుగుతుంది. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌‌లో వృద్ధులు, అనారోగ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి బ్లూప్రింట్‌‌ను సిద్ధం చేయడానికి ఈ-వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌‌ఫామ్‌‌ను సృష్టించాం. వచ్చే ఏడాది అందరికీ మంచి జరుగుతుందని, చాలా మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాం’ అని హర్ష వర్దన్ పేర్కొన్నారు.