వర్క్ విత్ బీర్ : ఆఫీసుల్లో మందు కొడుతూ పని చేసుకోవచ్చు

వర్క్ విత్ బీర్ : ఆఫీసుల్లో మందు కొడుతూ పని చేసుకోవచ్చు

మద్యం తాగుతూ పనిచేయొచ్చా?  చాలా మంది ఎంప్లాయిస్  ఈ అవకాశం ఉంటే  బాగుంటదనుకుంటారు.  కొలిగ్స్తో  చీర్స్ చెబుతూ పెగ్గుల మీద పెగ్గులు లాగించొచ్చు అనుకుంటారు. అయితే హర్యాన ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు ఇలాంటి  అవకాశం కల్పిస్తోంది. అవును ఆఫీసుల్లో పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు, కిక్కు కోసం చుక్కేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇక‌పై కార్పొరేట్ ఆఫీసు క్యాంటీన్లలో బీర్లు తాగేందుకు అనుమ‌తించింది. ఈ మేర‌కు హ‌ర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్కువ మోతాదు ఆల్కాహాల్ ఉండే  బీర్, వైన్ వంటి డ్రింక్స్ ను ఆఫీసుల్లోకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

2023-2024 సంవత్సరానికి గాను  హ‌ర్యానా ప్రభుత్వం కొత్త మ‌ద్యం పాల‌సీని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే  అన్ని ఆఫీసుల్లో నూ మద్యానికి అనుమతిచ్చింది. జూన్ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. 

కండీషన్స్

కార్పోరేట్ ఆఫీసులో మినిమం 5 వేల మంది ఉద్యోగుల ఉండాలి. అంతేగాకుండా ఆఫీసులో లక్ష ఫీట్ల ఆవరణ ఉండాలి. అలాగే 2 వేల ఫీట్లతో క్యాంటిన్, రూ.10 లక్షల ఫీజు కడితేనే ఆ కంపెనీకి తమ ఆఫీసులో మద్యం తాగేందుకు అనుమతిస్తారు.

ఇప్పటి వరకు కార్పొరేట్​ఆఫీసుల్లో ఆడుతూ పాడుతూ పని చేయటం, భోజనాలు పెట్టటం, వీకెండ్ పార్టీలు ఇవ్వటం కామన్ అయిపోయింది.. దీనికి కూడా కిక్కు లేదనుకున్నారో ఏమో.. ఆఫీసుల్లో మందు కొడుతూ పని చేసుకోండంటూ బంపరాఫర్ ఇచ్చింది సర్కార్. కార్పొరేట్ ఆఫీసుల్లో వర్క్ విత్ బీర్.. వర్క్ వింత్ వైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హర్యానా ప్రభుత్వం లిక్కర్ పాలసీని తీసుకు రావటం ఆసక్తిగా మారింది. ఇప్పటికే కిక్కు.. కిక్కు అంటున్న ఉద్యోగులకు.. ఇది సరైన కిక్ అంటున్నారు. బీర్ కొట్టి.. వైన్ తాగుతూ పని చేస్తుంటే.. ఆ కిక్కే వేరంటున్నారు. అయితే దీనికి చాలా రూల్స్ పెట్టింది. 

ఒక్కసారి స్టార్ట్ అయితే చాలు కదా.. రూల్స్ గీల్స్ జాన్తానై.. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసులకు వచ్చింది.. రేపు మామూలు ఆఫీసులకు రాదనే గ్యారెంటీ అయితే ఏమీ లేదు.. సో.. ఇక ఆఫీసుల్లో మందుకొట్టి.. బీభత్సంగా పని చేయొచ్చన్నమాట.. ఎక్కువ అయ్యి పడిపోయిన వాళ్లకు క్యాబ్ ఫెసిలిటీ కూడా ఇస్తే ఇంకా బెటర్ కదా..