గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్పొరేటర్ల ఆగ్రహం

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్పొరేటర్ల ఆగ్రహం

వరంగల్/వరంగల్‍ సిటీ, వెలుగు : ‘గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చాలా డివిజన్లలో పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లు లీకవుతున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ, అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటూ వందల కోట్ల ఖర్చు చూపుతున్రు.. అయినా పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీరొస్తలే.. రెండేండ్లు పూర్తవుతున్నా డివిజన్ల అభివృద్ధికి ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదు, కుక్కలు, కోతులు జనాలపై దాడులు చేస్తుంటే వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు’ అంటూ పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామంటూ ఆవేదన చెందారు. సోమవారం మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుండు సుధారాణి అధ్యక్షతన గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బస్వరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సారయ్య, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజ్వానా షమీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే వివిధ సమస్యలపై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు మాట్లాడారు. డివిజన్లలో అడుగుకో లీకేజీ కనిపిస్తోందని, నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు రిపేర్లకే పరిమితం అవుతున్నారని అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా, బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్లు సైతం జత కలిశారు.

రూ. 50 లక్షలు ఏమైనయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌?

అధికార పార్టీ కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వరరావు, వేముల శ్రీనివాస్‍, బీజేపీ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవినాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా ఒక్కో డివిజన్‍కు రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారన్నారు. పాలవర్గం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో కేటాయించిన రూ.5 లక్షల విషయంలోనూ పురోగతి లేదన్నారు. చెత్త సేకరణ సరిగా జరగడం లేదని, ట్రాక్టర్లు రావడం లేదని కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేముల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. గ్రేటర్‍ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుక్కలు, కోతులు, పందుల బెడద పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కాలనీల్లో లైట్లు వెలగడం లేదని, స్తంభాలు విరిగిపోయినా సరిచేయడం లేదని పలువురు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకొచ్చారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు.

పొగడ్తలకే పరిమితమైన మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కార్పొరేటర్లు చెప్పిన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పొగిడేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ‘మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం, మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానాలు చేశాం,  మహిళల 18 రకాల పరీక్షలు చేస్తున్నాం, కేటీఆర్‍ వరంగల్‍ పర్యటనలో రూ. 184 కోట్లకు శంకుస్థాపనలు చేశాం, కార్మికులకు రూ. 1000 జీతం పెంచాం, గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మించిన వైకుంఠధామానికి ట్విట్టర్లో కేటీఆర్‍ ప్రసించారు’ అని చెబుతూ సభ్యులతో చప్పట్లు కొట్టించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కప్‍ పోటీలను సక్సెస్‍ చేయాలన్నారు. గత రెండేళ్లలో రూ.895 కోట్లతో 4,270 పనులు ప్రతిపాదించగా.. 60 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.

8 అంశాలకు కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆమోదం

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 అంశాలకు ఆమోదం తెలిపారు. ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‍, మల్టిపర్పస్‍ వర్కర్ల జీతం పెంచడం, ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో పనిచేస్తున్న బ్యాడ్మింటన్‍ కోచ్‍ శ్రీధర్‍ పదవీ కాల పరిమితి మరో ఏడాది పెంచడం, జూడో కోచ్‍గా జన్ను సుజాతను నియమించడం, మూడో డివిజన్‍ పరిధిలోని ఆరేపల్లి, ప్రతిమ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తురక చెరువు వరకు రూ.కోటిన్నరతో సీసీ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ నిర్మించడం, పాత పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ల స్థానంలో కొత్తవి వేయడం, కాకతీయ సప్తాహ వేడుకల నిర్వహణ అంశాలను సభ్యులు ఆమోదించారు. కాగా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీతో పాటు 20 నుంచి 25 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.