కొత్తిమీర ఐస్​క్రీమ్​!

కొత్తిమీర ఐస్​క్రీమ్​!

వెనీలా, స్ట్రాబెర్రీ, చాక్లెట్​, కోకోనట్​.. అబ్బో ఇంకా  బోలెడు ఫ్లేవర్స్​ ఐస్​క్రీమ్స్​లో. కానీ, ఇప్పటివరకు కొత్తిమీర ఐస్​క్రీమ్​ తిన్నారా?  పోనీ దాని గురించి ఎక్కడైనా విన్నారా! ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ ఐస్​క్రీమ్​  ప్రపంచం మొత్తంలోనే ఒకే ఒక్క చోట దొరుకుతుంది. అదెక్కడ అంటే! చైనాలో. ఈ మధ్యే  చైనాలోని  మెక్​డొనాల్డ్స్​మెనూలో చేరింది ఈ ఐస్​ క్రీమ్​. అయితే ఇలాంటి వింత ప్రయోగాలు చైనా మెక్​ డొనాల్డ్స్​కి కొత్తేం కాదు.  

పైనాపిల్​ పై, టారో పై..  ఇలా ప్రపంచంలో మరెక్కడా లేని వంటకాలెన్నో చైనా మెక్​డొనాల్డ్స్​ మెనూలో ఉంటాయి. రీసెంట్​గా అందులో ఈ కొత్తిమీర ఐస్​క్రీమ్​ కూడా చేరిపోయింది. ఆ విషయాన్నే డానియల్​ అహ్మద్​  అనే ఆయన ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. ఈ ఐస్​క్రీమ్​ని కొత్తిమీర సాస్,  తరుగుతో  తయారుచేశారంటూ పోస్ట్​లో రాసుకొచ్చాడు కూడా. దాంతో ఈ చైనా మెక్​డొనాల్డ్స్​ స్పెషల్ కొత్తిమీర ఐస్​క్రీం ఇప్పుడు సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​ అయింది. ఈ ఐస్​ క్రీం పై మిగతా దేశాల రెస్పాన్స్​ అటుంచితే.. మన వాళ్లు మాత్రం ‘ప్లీజ్​ ఇక్కడికి మాత్రం తీసుకురావొద్దం’టూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.