కాస్ట్‌‌లీ దోపిడీ.. కారు చౌక మాటలు

కాస్ట్‌‌లీ దోపిడీ.. కారు చౌక మాటలు
  •      ఇది కల్వకుంట్ల గ్యాంగ్ పదేండ్ల దోపిడీ
  •     కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్లు

హైదరాబాద్, వెలుగు: కారు చౌక మాటలు మాట్లాడి.. కాస్ట్‌‌లీగా ఈ కల్వకుంట్ల గ్యాంగ్ గత పదేండ్లలో రాష్ట్రాన్ని దోచుకుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. “కథ ఎలా ఉంటదంటే.. చేసిందేమీ లేకున్నా మంచి పనులు చేస్తే అవి మేము చేసినవే అనుడు.. వాళ్ల చెడ్డ పనుల్లన్నీ మంది నెత్తులకు రుద్దుడు.. మీరు మంచి పనులు చేసుంటే ప్రజలే మిమ్మల్ని నెత్తిన పెట్టుకునేవారు.. ఇలా నెత్తి గొరిగి పంపకుండేవాళ్లు కాదు..!! ఇకనైనా చౌకబారు మాటలు, వేషాలు మాని చక్కని ప్రతిపక్షంగా ఉండనికే ప్రయత్నించండి.. లేదంటే ఆ హోదా కూడా గల్లంతై.. గల్లికీ పరిమితం కాగలరు!! జర భద్రం!!”అని తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం ట్వీట్ చేసింది. 

దీనికి కేసీఆర్ ఫ్యామిలీ కార్టూన్‌‌ను యాడ్ చేసింది. దోపిడీ గుంపు, కారు చౌక గ్యాంగ్ అనే హ్యాష్ ట్యాగ్‌‌ను జత చేసింది. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు చెప్పుకోవటానికి సిగ్గుండాలని కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌‌ కౌంటర్‌‌‌‌ ట్వీట్‌‌ చేసింది.