వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఖర్చులేమీ తగ్గవు..

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఖర్చులేమీ తగ్గవు..

నైట్ ఫ్రాంక్ రిపోర్ట్

రియల్ ఎస్టేట్ ఖర్చులు కేవలం 4.3 శాతమే

ఆఫీసు స్పేస్ రెంట్లు 0.5 % నుంచి 2%

ఆఫీసులను మిస్ అవుతున్నామన్న ఉద్యోగులు

ముంబై: వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ వల్ల ఇండియన్ ఐటీ కంపెనీల ఖర్చులు పెద్దగా తగ్గవని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ స్టడీ తెలిపింది. ఐటీ కంపెనీల ఆపరేటింగ్ ఇన్‌‌కమ్‌‌లో యాన్యువల్ రియల్ ఎస్టేట్ ఖర్చులు కేవలం 4.3 శాతమేనని చెప్పింది. మొత్తంగా 119 ఐటీ కంపెనీల ఫైనాన్సియల్ స్టేట్‌‌మెంట్లను నైట్ ఫ్రాంక్ ఎనాలసిస్ చేసింది. ఈ ఎనాలసిస్‌‌లో చిన్న ఐటీ కంపెనీలు రియల్ ఎస్టేట్‌‌పై 4.7 శాతం ఖర్చు చేస్తున్నాయని తెలిపింది. పెద్ద కంపెనీలు 4.4 శాతం, మిడ్‌‌సైజ్ ఐటీ కంపెనీలు 3.6 శాతం వెచ్చిస్తున్నట్టు పేర్కొంది. మొత్తంగా ఐటీ కంపెనీలు చెల్లించే ఆఫీసు స్పేస్ రెంట్లు 0.5 శాతం నుంచి 2 శాతం మధ్యలో ఉంటున్నాయని నైట్‌‌ ఫ్రాంక్ వెల్లడించింది. మిగిలిన ఖర్చులు ఆయా కార్యాలయాలను ఆపరేట్ చేసేందుకు అవుతున్నట్టు వివరించింది.  కంపెనీలో 50 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు పరిగణనలోకి తీసుకుంటే నెట్ కాస్ట్ సేవింగ్స్ 1 శాతం మాత్రమే ఉంటున్నట్టు తెలిపింది. అదనంగా హోమ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు ఐటీ కంపెనీలే ఖర్చులు భరించాల్సి వస్తుందని పేర్కొంది. సొంత ఆఫీసు కార్యాలయాలు ఉన్న పెద్ద ఐటీ కంపెనీలైతే, వారి కాస్ట్ సేవింగ్స్ జీరోగా ఉంటాయని చెప్పింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ , వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఏది ఎంచుకోవాలనేది.. చాలా అంశాలను బట్టి ఉంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎండీ, ఛైర్మన్ శిశిర్ బైజాల్ అన్నారు. కేవలం కాస్ట్ సేవింగ్స్ ఒకటే కాదన్నారు. రియల్ ఎస్టేట్ ఖర్చుల సేవింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నారు. నైట్ ఫ్రాంక్ ఇండియా సర్వేలో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల నుంచి పాల్గొన్న 1600 మంది ఉద్యోగుల్లో.. 90 శాతం మంది రెస్పాండెంట్లు తాము ఆఫీసు వాతావరణాన్ని మిస్ అవుతున్నట్టు విచారణ వ్యక్తం చేశారు. వర్క్‌‌ప్లేస్‌‌లను మిస్ అవుతున్న ఎంప్లాయీస్‌‌లో 98 శాతం ఎన్‌‌సీఆర్ నుంచి ఉన్నారు. ఆ తర్వాత ముంబై నుంచి 94 శాతం మంది, బెంగళూరు నుంచి 91 శాతం మంది, చెన్నై నుంచి 90 శాతం మంది, పుణే నుంచి 88 శాతం మంది, హైదరాబాద్ నుంచి 81 శాతం మంది రెస్పాండెంట్లు వర్క్ ఎన్విరాన్‌‌మెంట్‌‌ను మిస్ అవుతున్నామని చెప్పారు. ఆఫీసుకు ట్రావెల్ లేకపోవడంతో 60 శాతం మంది రెస్పాండెంట్లు  సమయం ఆదా అవుతున్నట్టు  చెప్పారు. ఇండియా ఆఫీసు మార్కెట్‌‌కు ఐటీ సెక్టార్ కీలకంగా ఉంది. గత పదేళ్లలో ఆఫీసు స్పేస్ డిమాండ్‌‌లో 44 %  ఐటీ నుంచే వస్తోంది.

For More News..

గ్లోబల్ లీడర్​గా ఇండియా

ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు.. 10 మంది మృతి