పత్తి కూలీల ఆటో బోల్తా.. నల్గొండ జిల్లా బుగ్గ తండా దగ్గర ప్రమాదం

పత్తి కూలీల ఆటో బోల్తా.. నల్గొండ జిల్లా బుగ్గ తండా దగ్గర ప్రమాదం
  • 16 మందికి గాయాలు, ఒకరికి సీరియస్ 

దేవరకొండ( నేరేడుగొమ్ము) వెలుగు : పత్తి కూలీల ఆటో అదుపుతప్పి బోల్తా పడి16 మందికి గాయాలైన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. నేరేడుగొమ్ము ఎస్ఐ కె.నాగేంద్రబాబు తెలిపిన  ప్రకారం.. పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామానికి చెందిన18 మంది కూలీలు పత్తి తీసేందుకు గురువారం ఆటోలో కాచరాజుపల్లికి వెళ్తున్నారు. నేరేడుగొమ్ము మండలం బుగ్గతండా ఘాట్ రోడ్డు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణించే 16 మందికి గాయాలయ్యాయి. అంబులెన్స్ లో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. మరో కూలీ రమేశ్​తలకు బలమైన గాయాలు కావడంతో కండీషన్ సీరియస్ గా ఉండగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఆటో ప్రమాదానికి అతివేగం, పరిమితికి మించి ఎక్కించుకోవడమే కారణమని, బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు.