ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 23న ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లు 25కు వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు.
అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.