చైనాకు రావాలని అజిత్ ధోవల్కు ఆహ్వానం

చైనాకు రావాలని అజిత్ ధోవల్కు ఆహ్వానం

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా తమ దేశానికి రావాలంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ధోవల్ను ఆహ్వానించారు. దీనిపై ధోవల్ పాజిటివ్గా స్పందించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారం అయిన అనంతరం చైనాకు వస్తానని చెప్పారు. లద్దాఖ్ తో పాటు ఇతర వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంటేనే ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని ధోవల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం..

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

RRR రివ్యూ: ఎవ్వరూ తగ్గలే!